'షహీద్ మేళా బేవర్' ఉత్తర ప్రదేశ్ అధ్యక్షుడిగా డా.గజల్ శ్రీనివాస్

- December 31, 2019 , by Maagulf
'షహీద్ మేళా బేవర్' ఉత్తర ప్రదేశ్ అధ్యక్షుడిగా డా.గజల్ శ్రీనివాస్

బేవర,యూపీ:ప్రతిష్టాత్మక  సంస్థ " షహీద్ మేళా బేవర్ -ఉత్తర ప్రదేశ్ " అధ్యక్షుడిగా  ప్రఖ్యాత గ్గాయకులు డా.గజల్ శ్రీనివాస్ ను మేళా కమిటి ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్టు  సంస్థ సంచాలకులు రాజ్ త్రిపాఠి పత్రికా ప్రకటనలో తెలియజేసారు.షహీద్ మేళా  ప్రతి ఏటా జనవరి 23 నుండి ఫిబ్రవరి 10 వ తేదీ వరకు జరుగుతుందని,  స్వాతంత్ర సంగ్రామంలో  అసువులు బాసిన త్యాగధనులకు లక్షలాది మంది ఈ ఉత్సవం లో నీరాజనం పలుకుతారని తెలిపారు.  దేశవ్యాప్తం గా ఎంతో మంది ఈ ఉత్సవం లో సాంస్కృతిక కార్యక్రమాలు,చిత్ర ప్రదర్శన, కవి సమ్మేళనం లో పాల్గొని దేశభక్తి ని చాటి చెబుతారని తెలిపారు. 

1942 లో  కృష్ణ కుమార్,14 ఏళ్ళ విద్యార్థీ, సీతా రామ్ ,జమునా ప్రసాద్ త్రిపాఠి లు బ్రిటిష్ వారి తుపాకీ  గుళ్లకు ఎదురువెళ్లి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ పిదప లక్షలాది మంది స్పూర్తి పొంది బేవర్ లో ఉద్యమాన్ని ఉదృతం చేసారు.ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసారు. వారి గురుతుగా 1972 నుండి షహీద్ మేళా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు , దేశం లో మరెక్కడా లేనట్టుగా 26 మంది స్వాతంత్ర  సమర యోధులకు "షహీద్ మందిరాన్ని " నిర్మించినట్టు రాజ్ త్రిపాఠి తెలిపారు.డా.గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో  భవిష్యత్తులో అన్ని రాష్ట్రల్లో  షహీద్ మేళ నిర్వహించి ఈ తరం ప్రజలకు స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గురుతుచేస్తామని అన్నారు. త్వరలో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో నిర్వహిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com