జీతాలు చెల్లించలేదు.. పైగా 'తొలగింపు' హెచ్చరికలు
- January 02, 2020
కువైట్ సిటీ: 200 మంది కార్మికులకు ఓ కంపెనీ జీతాలు చెల్లించకపోగా, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్‌తో కాంట్రాక్ట్ వున్న కంపెనీ కార్మికుల తరఫున లేబర్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ - ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ సెక్టార్ వద్ద ఫిర్యాదు చేయడం జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించనుంది. అథారిటీ ఈపీఎస్, సదరు కంపెనీ రిప్రెజెంటేటివ్స్కి ఈ విషయమై ఇప్పటికే సమన్లు కూడా పంపినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు ముగిసిన తర్వాత తమతో కంపెనీ బార్గెయినింగ్కి దిగిందనీ, 900 దిర్హామ్‌లు ఇచ్చి, ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతిస్తామని ఆ కంపెనీ ప్రతినిథులు చెబుతున్నారనీ, లేదంటే దేశం వదిలి వెళ్ళాలని హెచ్చరిస్తున్నారని కార్మికులు వాపోయారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించలేదని తాము గతంలోనే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్‌కి ఫిర్యాదు చేశామని అన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







