చిరు మూవీ షురూ
- January 02, 2020
ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రం ఈరోజు సెట్స్ పైకి వెళ్ళింది. సైరా తో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి..సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్లో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు.
కమర్షియల్ అంశాలు కలిగిన సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ లో చిరుకు జోడిగా త్రిష ను ఎంపిక చేసాడు శివ. మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా ..ఆగష్టు 14 వ తేదీన సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ మూవీ ని రామ్ చరణ్ తో పాటు మ్యాటినీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..