తైవాన్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం..దేశ సైన్యాధిపతి మృతి

- January 02, 2020 , by Maagulf
తైవాన్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం..దేశ సైన్యాధిపతి మృతి

 

తైపీ: హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో తైవాలం సైన్యాధిపతితో సహా మరో ఎనిమిది మంది మృతిచెందారు. దెస రాజధాని తైపీ సమీపంలోని ఒక పర్వతం పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఈశాన్య యిలాన్ కౌంటీలో సైనికులను కలవటానికి తైవాలం చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ షెన్-ఇ-మింగ్ బయలుదేరారు.ఈ ఉదయం 7:50 నిమిషాలకు సొంగ్షాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఆయన ఎక్కిన హెలికాఫ్టర్ బయలుదేరింది. 8:06 నిమిషాలకు సిబ్బంది నుంచి ఆఖరి సమాచారం వచ్చింది.ఆపై ఒక్క నిమిషం తరువాత నుంచి దానితో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం ఆ హెలికాఫ్టర్ తైపీ పట్టణం సమీపంలోని పర్వతాలలో కూలిపోయింది. కూలిపోయిన UH60M హెలికాఫ్టర్ లో 62 సంవత్సరాల మింగ్ తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com