'మా' వేదికగా మోహన్ బాబు - చిరంజీవి మధ్య వెల్లివిరిసిన స్నేహం..

- January 02, 2020 , by Maagulf
'మా' వేదికగా మోహన్ బాబు - చిరంజీవి మధ్య వెల్లివిరిసిన స్నేహం..

 

హైదరాబాద్: ఫిలింనగర్‌లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అబ్బురపరిచే సంఘటనకు వేదికైంది. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్‌ మోహన్ బాబు మధ్య నున్న స్నేహబంధం వెల్లివిరిసింది. సభలో మాట్లాడిన మోహన్‌బాబు... తనకు, చిరంజీవికి మధ్య నడిచేవి ఛలోక్తులు మాత్రమేనన్నారు. ఎప్పటికీ తమ రెండు కుటుంబాలు ఒక్కటేనని స్పష్టం చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతున్నప్పుడే ఆయన దగ్గరకు చిరంజీవి వెళ్ళి, మెడ చుట్టూ చేతులు వేసి, ఆప్యాయతతో పలుకరించి బుగ్గపై ముద్దిచ్చి, భుజం తట్టి వెళ్ళారు.

ఇదే సభలో పాల్గొన్న 'మా' వైస్ ప్రెసిడెంట్, హీరో రాజశేఖర్ ప్రవర్తించిన తీరుపై మోహన్ బాబు మండిపడ్డారు. 'మా' ఎవడబ్బ సొత్తు కాదు.. అందరి సొత్తు.. అన్నారు. 40 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించి, పరిశ్రమను ఆదుకున్న ఏకైక వ్యక్తి టి.సుబ్బరామిరెడ్డి ఎదుట ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com