ఒమన్‌లో రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మూసివేత
- January 02, 2020
మస్కట్: వినియోగదారులకు డొమెస్టిక్ సర్వీస్ అందిస్తోన్న ఓ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీని పలు ఫిర్యాదుల మేరకు అల్ దఖ్లియా గవర్నరేట్ మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించిన వివరాల ప్రకారం, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ - బహ్లా, ఈ ఏజెన్సీని మూసివేయాలని తీర్పునివ్వడం జరిగింది. అలాగే ఏజెన్సీకి 1,550 ఒమన్ రియాల్స్ జరీమానా కూడా విధించింది. కస్టమర్లను డూపింగ్ చేస్తున్నట్లు ఏజెన్సీపై ఫిర్యాదులు అందడమే దీనికి కారణం. వర్కర్స్‌ని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్‌లు తీసుకుని, వాటిని డిపాజిట్లుగా మలచి, వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. కన్స్యుమర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 900 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాలనీ, వినియోగదారులకు 1,550 ఒమన్ రియాల్స్ చెల్లించాలనీ న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







