రోజూ ఉడికించిన మొక్కజొన్నలతో ఉపయోగాలు

- January 03, 2020 , by Maagulf
రోజూ ఉడికించిన మొక్కజొన్నలతో ఉపయోగాలు

మొక్కజొన్నలు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. మొక్కజొన్న కమ్మని రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయి. అంతేకాదు, ఇందులో శక్తివంతమైన పోషకాలు లభిస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు మొక్కజొన్న తింటే సమస్య నుండి ఉపశమనం పొందవచ్చును. ఇందులో ఉండే విటమిన్ బి 12, ఐరన్ వంటి ఖనిజాలు రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి.

మొక్కజొన్న దాదాపు శరీరపు ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది. ఇందులో లభించే ఖనిజాలు శాతం ఎక్కువే. మొక్కజొన్నలో ఉండే ఫాస్పరస్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మెగ్నిషియం ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది. అలానే మెదడు నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నలో ఉండే పైటోకెమికల్స్ శరీరంలో ఇన్సూలిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకుపోకుండా చేస్తాయి.

మధుమేహ వ్యాధితో బాధపడేవారు తరచు మొక్కజొన్నతో తయారుచేసిన ఆహారపదార్థాలు తింటుంటే.. వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. రోజూ కప్పు ఉడికించిన మొక్కజొన్నలు తింటే.. ఎర్రరక్తకణాల వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. దాంతోపాటు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం కాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు, పక్షవాతం, బీపి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com