రోజూ ఉడికించిన మొక్కజొన్నలతో ఉపయోగాలు
- January 03, 2020మొక్కజొన్నలు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. మొక్కజొన్న కమ్మని రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయి. అంతేకాదు, ఇందులో శక్తివంతమైన పోషకాలు లభిస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు మొక్కజొన్న తింటే సమస్య నుండి ఉపశమనం పొందవచ్చును. ఇందులో ఉండే విటమిన్ బి 12, ఐరన్ వంటి ఖనిజాలు రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి.
మొక్కజొన్న దాదాపు శరీరపు ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది. ఇందులో లభించే ఖనిజాలు శాతం ఎక్కువే. మొక్కజొన్నలో ఉండే ఫాస్పరస్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మెగ్నిషియం ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది. అలానే మెదడు నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నలో ఉండే పైటోకెమికల్స్ శరీరంలో ఇన్సూలిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకుపోకుండా చేస్తాయి.
మధుమేహ వ్యాధితో బాధపడేవారు తరచు మొక్కజొన్నతో తయారుచేసిన ఆహారపదార్థాలు తింటుంటే.. వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. రోజూ కప్పు ఉడికించిన మొక్కజొన్నలు తింటే.. ఎర్రరక్తకణాల వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. దాంతోపాటు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం కాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు, పక్షవాతం, బీపి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల