సరిలేరు నీకెవ్వరు సెన్సార్ పూర్తి

- January 03, 2020 , by Maagulf
సరిలేరు నీకెవ్వరు సెన్సార్ పూర్తి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ ని పొందింది.

సినిమా మొత్తాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీంతో ప్రమోషన్లో మరింత వేగాన్ని పెంచనుంది సరిలేరు టీమ్. ఇదిలా ఉంటే సెన్సార్ పూర్తి అయ్యిందంటూ విడుదల చేసిన పోస్టర్లలో రిలీజ్ డేట్ లేకపోవడం గమనర్హం. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందన్న అనుమానం ఫ్యాన్స్‌లో మొదలైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com