చలికాలంలో అనారోగ్యాల బారినపడకుండా ఉండాలంటే...
- January 05, 2020
చాలామంది చలికాలంలో అనారోగ్యాల బారినపడుతుంటారు. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో పాటు మంచు, చలి, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో తీసుకునే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే అనారోగ్యంబారిన పడకుండా ఉండొచ్చు.
చలికాలంలో జలుబు, దగ్గు వంటివి సాధారణం. వాతావరణంలో మార్పులు, చల్లటి గాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండడమే అందుకు కారణం. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడకుండా రక్షణ పొందొచ్చు. అవేంటో ఓసారి చూద్ధాం.
అల్లం : తేనె కలిపిన అల్లం ముక్కలను లేదా అల్లం రసంగానీ రోజూ తీసుకున్నట్టయితే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణశక్తి సమస్యలు కూడా పరిష్కరమవుతాయి.
పసుపు : ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు... ఓ గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గిపోవడమే కాకుడా, రోగ నిరోధకశక్తి కూడా తగ్గిపోతాయి.
చిలగడదుంప : చలికాలంలో వీటిని క్రమంగా తీసుకున్నట్టయితే ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటిలో అధికంగా పీచుపదార్థం, విటమిన్ ఏ, పొటాషియం వంటి అధికంగా ఉంటాయి.
నువ్వులు : శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో నువ్వులు బాగా పని చేస్తాయి. వారంలో మూడు రోజుల పాటు నూనెతో శరీరాన్ని బాగా మర్దన చేసుకుని స్నానం చేసినట్టయితే శరీరంలో వేడి పెరిగి, చలి నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఎండు పండ్లు : జీడిపప్పు, వాల్ నట్స్, బాదం పప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు వంటివి పరిమితంగా తీసుకుంటే... శరీరానికి పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి చిట్కాలతో చలికాలంలో అనారోగ్యం బారినపడకుండా ఉండొచ్చు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..