కువైట్:ప్రవాసీయులకు గుడ్ న్యూస్..స్థానికేతరులకు కూడా గవర్నమెంట్ జాబ్స్

- January 05, 2020 , by Maagulf
కువైట్:ప్రవాసీయులకు గుడ్ న్యూస్..స్థానికేతరులకు కూడా గవర్నమెంట్ జాబ్స్

కువైట్ లో 50 ఏళ్లుగా అమలులో ఉన్న నిబంధనలకు ఇక కాలం చెల్లనుంది. గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్ మెంట్ లో ప్రభుత్వం సమూల మార్పులు చేపట్టే దిశగా అడుగులు పడుతున్నాయి.  ఈ మేరకు పార్లమెంటరీ హ్యూమన్ రీసోర్స్ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ఉద్యోగాల నియామకాల్లో సివిల్ సర్వీస్ కమిషన్-CSCకి ఉన్న మినహాయింపులను రద్దు చేసి రిప్లేస్ మెంట్ పాలసీలో నాన్ కువైటీలపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ప్రతిపాదించింది. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ లోనూ సీ, డీ గ్రాడ్యూయేషన్ గ్రేడ్స్ ఉన్న కువైటేతరులకు కూడా ఉద్యోగాలు కల్పించాలని రికమండ్ చేసింది.

నేషనల్ మ్యాన్ పవర్ ను అబ్సర్బ్ చేసుకొని వారి ప్రతిభ, శక్తిసామర్థ్యాలను సద్వినియోగం చేసుకునేలా రిక్రూట్ మెంట్ పాలసీ ఉండాలని కమిటీ పేర్కొంది. ఈ విషయంలో ఇరుగు పొరుగు దేశాలు అవలంభిస్తున్న విధానాలను ఇంప్లీమెంట్ చేయాలంది. అదే సమయంలో నిరుద్యోగంపై పోరాడేలా ప్రైవేట్ సెక్టార్ లోనూ ఉద్యోగావకాశాల పెంపొందించి యువతను ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని పేర్కొంది. అంతేకాకుండా యువత ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాల్లో చేరేలా తగిన ప్రొత్సహించాలని..వారికి తగిన ఉద్యోగ భద్రత కల్పించటంతో పాటు బోనస్ విషయంలోనూ ఇప్పటివరకు ఉన్న నిబంధనలు సమూల మార్పులు రావాలని కమిటీ డిమాండ్ చేసింది. బోనస్ సమాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా కేవలం ఉద్యోగుల ప్రతిభ, ఇయర్ వైజ్ అచీవ్ మెంట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వాలని సూచించింది.

50 ఏళ్లుగా అవలంభిస్తున్న సిస్టంలో మార్పులు తీసుకువచ్చేందుకు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. మ్యాన్ పవర్ అథారిటీ, ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ, ప్లానింగ్ సెక్రేటరియేట్ జనరల్..ఈ మూడు విభాగాలు కలిసి రాబోయే ఐదేళ్లలో నాన్ టెక్నికల్ జాబ్స్ ను జాతీయం చేసేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని పార్లమెంటరీ హ్యూమన్ రీసోర్స్ కమిటీ ఆదేశించింది. అలాగే రాబోయే ఐదేళ్లలో లోకల్ మర్కెట్ జాబ్స్ డిమాండ్, గ్రాడ్యూయేట్ పూర్తి చేయబోయే యువత గణాంకాలపై ప్లాన్ రెడీ చేయాలని ఉన్నత విద్య మంత్రిత్వ శాఖకు సూచనలు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com