వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' పలు ప్రమాదాలకు సంకేతాలు

- January 17, 2016 , by Maagulf
వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' పలు ప్రమాదాలకు సంకేతాలు

 తమకే కాక ఎదుటవారి ప్రాణాలకు ముప్పు కల్గించే  ' సేల్ఫీలు '  విషయంలో రాయల్ ఒమాన్ పోలీసులు  ఇకపై  తీవ్రంగా పరిగణించనున్నారు. ' సుల్తాన్ కబోస్ ' జాతీయ రహదారిపై వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' తీసుకోవడం ఓకే దుశ్చర్య అని పేర్కొన్నారు. తాను నడుపుతున్న వాహనం ద్వారా మరొకరికి  అసౌకర్యం కలిగించకూడదనే ఒక మంచి భావన అలవార్చుకోవాలన్నారు. వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' తీస్తూ, ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాక ఎదుటి వారిని సైతం చంపివేస్తున్నారని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయని రాయల్ ఒమాన్ పోలీసులు వివరిస్తున్నారు. వాహనాలను నడుపుతూ మొబైల్ ఫోన్లలో మాట్లాడటం , సంక్షీప్త సమాచారంను ఫోన్లో చదవడం , ' సేల్ఫీలు ' తీయడం చట్ట ఉల్లంఘన నేరంగా నమోదు చేస్తారు. ఈ చర్యలు వాహనచోధకుని ఏకాగ్రతను దెబ్బ తీయగలవని వారు తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com