ట్రంప్ తల తెచ్చినవారికి 80 మిలియన్ డాలర్ల రివార్డ్

- January 06, 2020 , by Maagulf
ట్రంప్ తల తెచ్చినవారికి 80 మిలియన్ డాలర్ల రివార్డ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చి ఆయన తల తెచ్చినవారికి 80 మిలియన్ డాలర్ల రివార్డ్ ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. గతవారం అమెరికా వైమానికదాడుల్లో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమాన్ హతమైన సంగతి తెలిసిందే. ఆయన మృతికి కారకుడైన ట్రంప్ ను హతమార్చినవారికి ఈ భారీ ' బహుమతి ' దక్కనుందని ఇరాన్ పేర్కొంది. సులేమాన్ అంతిమ యాత్ర సందర్భంగా.. ఆ దృశ్యాన్ని ప్రసారం చేస్తున్న టీవీ ఛానల్ ఒకటి.. దేశంలోని ప్రతి ఇరానీయుడూ ఒక డాలర్ ను ' విరాళం ' గా ఇస్తే ఆ నగదును మొత్తం కలిపి అమెరికా దేశాధ్యక్షుడిని చంపినవారికి రివార్డుగా ఇస్తామని ప్రకటించింది.దేశంలో 80 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని,ఈ జనాభాను బట్టి 80 మిలియన్ డాలర్లను సమీకరించాలనుకుంటున్నామని తెలిపింది. కాగా- తాము అమెరికా లోని శ్వేత సౌధం వైట్ హౌస్ మీద దాడి చేయగలుగుతామని, అమెరికా గడ్డపైనే వారిని ఎదుర్కోగలుగుతామని అబుల్ ఫజల్ అబూ తొలాబీ అనే ఎంపీ పేర్కొన్నారు. ఇది ఒక విధంగా యుధ్ధ ప్రకటనే అన్నారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఓపెన్ సెషన్ లో.. ట్రంప్ ను ' ఓ సూట్ కేసులోని టెర్రరిస్టు ' గా అభివర్ణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com