మార్నింగ్ వాక్‌తో ప్రయోజనాలు..

- January 07, 2020 , by Maagulf
మార్నింగ్ వాక్‌తో ప్రయోజనాలు..

ఆధునిక ప్రపంచం సరికొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని సౌకర్యాలు డోర్ డెలివరీలు చేయించుకునే సౌలభ్యం వచ్చింది. ఈ గజి 'బిజీ' జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వాళ్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. తినడానికి కూడా సమయం దొరకనంత బిజీగా ఉద్యోగాల్లో నిమగ్నమై ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరం అలసటకు గురవుతుంది. ఇలాంటి పరిస్థితిని దరిచేరనీయకుండా ఉండేందుకు రోజుకి కనీసం 20 నిమిషాల పాటు నడిస్తే శరీరానికి చాలా మంచిదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

నడకతో అన్ని రకాల రోగాలు దూరం అవుతాయి. రక్తపోటు, మధుమేహం, మానసిక ఒత్తిడి, క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు రావు. ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభిస్తుంది. ఉదయాన్నే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మనిషిపై పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. శరీరభాగంలో ఉన్న అధిక కొవ్వును కరిగించి, బరువు తగ్గించేందుకు నడక దోహదపడుతోంది. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిరంతరం వాకింగ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాకింగ్ చేయడాన్ని చిన్నతనం నుండే అలవాటుగా మార్చుకోవడం మంచిదని సూచించారు. ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటారని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉద్యోగ రీత్యా కలిగే మానసిక ఒత్తడిని కూడా వాకింగ్ నియంత్రిస్తుందని మానసిక వైద్యులు చెప్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com