అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రద్దు...

- January 17, 2016 , by Maagulf
అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రద్దు...

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ స్వతంత్రసింగ్‌ శుక్రవారం పరిశీలించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సంజయ్‌పరేఖ్‌ హాజరు కానందున విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. కాగా, లోపభూయిష్టంగా, అక్రమంగా పర్యావరణ అనుమతులు జారీ చేశారని పిటిషనర్‌ శ్రీమన్నారాయణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అనుమతులేవీ పారదర్శకంగా జారీ కాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏల నుంచి న్యాయవాదులు గంగూలి, దమ్మలపాటి శ్రీధర్‌ హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com