కువైట్: అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం..ఫుడ్ సెక్యూరిటీకి ఢోకా లేదు-UCCS

- January 07, 2020 , by Maagulf
కువైట్: అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం..ఫుడ్ సెక్యూరిటీకి ఢోకా లేదు-UCCS

కువైట్ : ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూనియన్ ఆఫ్ కన్సూమర్ కో-ఆపరేటీవ్ సోసైటీస్ ఛైర్ పర్సన్ మేషాల్ అల్ సయ్యర్ అన్నారు. రీజినల్ గా ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కునేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. క్రైసిస్ సమయాల్లో కూడా ఫుడ్ సెక్యూరిటీకి ఢోకా లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. యుద్ధ పరిస్థితులు తలెత్తిన సమయాల్లో కో-ఆపరేటీవ్ సొసైటీస్ కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. ఆరు నెలలకు సరిపడేలా నిత్యావసరాలను స్టోర్స్ కు అందించేలా కోఅపరేటీవ్ సొసైటీస్ ముందస్తు చర్యలు తీసుకుందని, ఫుడ్ సెఫ్టీ, ఫుడ్ సెక్యూరిటీ UCCS బాధ్యతని ఆయన గుర్తు చేశారు. నిత్యావసరాలు, ఆహార నిల్వల కోసం గిడ్డంగి ఏర్పాటు చేసుకునేలా వాణిజ్య  మంత్రిత్వ శాఖ అధికారులు UCCSతో కోఆర్డినేట్ చేస్తున్నారని మేషాల్ అల్ సయ్యర్ అన్నారు. ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాల నిల్వలు సరిపడినంత ఉన్నాయని, ఎవరూ కంగారుపడాల్సిన పని లేదని తెలిపిన మేషాల్ అల్ సయ్యర్.. దొంగచాటుగా నిల్వలు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com