వార్ ఇండికేషన్స్:ఇరాక్ లోని అమెరికా ఆర్మీ బేస్ లపై ఇరాన్ మిస్సైల్ అటాక్

- January 08, 2020 , by Maagulf
వార్ ఇండికేషన్స్:ఇరాక్ లోని అమెరికా ఆర్మీ బేస్ లపై ఇరాన్ మిస్సైల్ అటాక్

బాగ్ధాద్:అమెరికా-ఇరాన్ మధ్య వార్ ఇండికేషన్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నెలకొన్న ఉద్రిక్తత మరింత క్రైసిస్ దిశగా దారితీస్తోంది. ఇరాన్ ఆర్మీ కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకొని తీరుతామని ప్రకటించిన ఇరాన్..అతని అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజే అమెరికాపై రీవేంజ్ అటాక్స్ మొదలుపెట్టింది. ఇరాక్ లోని అమెరికా అర్మీ ఎయిర్ బేస్ టార్గెట్ చేసుకొని బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించింది. ఆల్ అసద్, ఇర్బిల్ ఎయిర్ బేస్ లపై డజన్ కు పైగా మిస్సైల్స్ తో దాడి చేసింది. ఈ దాడిలో జరిగిన నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. ఇరాక్ లోని తమ ఆర్మీ ఎయిర్ బేస్ లపై దాడిని పెంటగాన్ కూడా కన్ఫమ్ చేసింది. దాడి విషయం తెలియగానే
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. సరైన సమయంలో సరైన తీరులో బదులిస్తామని దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ రివేంజ్ అటాక్స్ తో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే టెన్షన్ వెదర్ కంటిన్యూ అయితే ఇప్పటికే పెరిగిపోయిన చమురు ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రపంచ దేశాల ఆర్ధిక పరిస్థితులపై నెగటీవ్ ప్రభావం చూపించనుంది.

ఇదిలాఉంటే అమెరికా ఆర్మీ ఎయిర్ బేస్ పై బాలిస్టిక్ మిస్సైల్స్ విరుచుకుపడుతుండగానే మరోవైపు ఇరాక్ రాజధాని బాగ్ధాద్ గగనతలంలో మిలటరీ జెట్స్ చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ప్రతినిధులు జెట్స్ ఫ్లై అయినట్లు చెబుతున్నా..ఇటు ఇరాక్ అధికారులుగానీ, అటు ఇరాన్ అఫిషియల్స్ కన్ఫమ్ చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com