దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న దుబాయ్ పోలీస్

- January 08, 2020 , by Maagulf
దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న దుబాయ్ పోలీస్

దుబాయ్:పని చేస్తున్న కంపెనీకే కన్నం వేశాడు ఒకడు. సెక్యూరిటీ గార్డు కూడా సహకరించాడు. మరో ఇద్దరు దొంగ సొత్తును తరలించేందుకు ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ బాగానే వర్కౌట్ చేశారు. తీరా సొత్తు తరలించే సమయంలో పెట్రోలింగ్ పోలీసులకు అనుమానం రావటంతో కథ అడ్డం తిరిగింది. మొత్తం నలుగురు అడ్డంగా బుక్కైపోయారు. దుబాయ్ లోని జెబెల్ అలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూడ్స్ తో వెళ్తున్న ట్రక్కు విషయంలో అనుమానం రావటంతో పెట్రోలింగ్ పోలీసులు ట్రక్కును నిలిపివేశారు. ట్రక్ లోని గూడ్స్ గురించి ఆరా తీశారు. అయితే..కంపెనీ గూడ్స్ ను మరో చోటికి డెలివరి చేస్తున్నామని సమాధానం చెప్పినా..అందుకు తగిన ఆధారాలను మాత్రం చూపించలేకపోయారు. గూడ్స్ కు సంబంధించిన ఇన్వాస్ బిల్లులు కూడా, డాక్యూమెంట్స్ లేకపోవటంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. వారిని మరింత ఎంక్వైరీ చేయటంతో కంపెనీ నుంచి గూడ్స్ ఎత్తుకొచ్చిన నిజాన్ని ఒప్పుకున్నారు. సెక్యూరిటీ గార్డుతో పాటు కంపెనీ ఉద్యోగి హస్తం ఉన్నట్లు చెప్పటంతో వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. నలుగురిపై విచారణ కొనసాగుతోంది. దొంగసొత్తును స్వాధీనం చేసుకొని నలుగురిని పట్టుకున్న పెట్రోలింగ్ పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com