ఉక్రెయిన్ లో విమాన ప్రమాదం..170 మందికి పైగా ప్రయాణికుల మృతి
- January 08, 2020
ఉక్రెయిన్ ప్రయాణికుల విమానం ఇరాన్‌లో కూలిపోయింది. ఈ విమానంలో 170 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. విమానంలో ఉన్నవారు సజీవంగా ఉండే అవకాశమే లేదని ఇరాన్‌కు చెందిన రెడ్ క్రిసెంట్ ప్రకటించింది.
రాయిటర్స్ వార్తల ప్రకారం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ ఖామెనెయీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాగానే ప్రమాదానికి గురైంది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ విమానం ప్రమాదానికి గురైందని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ చెప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విమానం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెళ్తోంది.
విమానాశ్రయం దగ్గర ఘటనాస్థలం దగ్గరకు సహాయ సిబ్బందిని పంపించారు. "విమానం మంటల్లో ఉంది. కానీ మేం సిబ్బందిని పంపించాం. కొంతమందినైనా కాపాడగలమని అనుకుంటున్నాం" అని ఇరాన్ అత్యవసర సేవల అధికారి పిర్హొస్సేన్ కౌలీవాండ్ రాయిటర్స్‌తో అన్నట్లు ఇరాన్ టీవీ చెప్పింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







