ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు:సాయం కోసం ముందుకొచ్చిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- January 08, 2020
ఆస్ట్రేలియాలో ఇటీవల చోటు చేసుకున్న తీవ్రమైన కార్చిచ్చు విషయమై సహాయం అందించేందుకు తాము సిద్ధంగా వున్నట్లు అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో షేక్ మొహమ్మద్ ఈ మేరకు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఆస్ట్రేలియాకి యూఏఈ ఈ విషయంలో అండగా వుంటుందని షేక్ మొహమ్మద్ చెప్పారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ - ఆస్ట్రేలియన్ గవర్నమెంట్‌తో కలిసి ఈ విషయమై పనిచేస్తుందని ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్‌కి షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ చెప్పారు. ఈ కార్చిచ్చులో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మిలియన్ల కొద్దీ జంతు జాలం మృత్యువాత పడింది. సెప్టెంబర్ నుంచి ఈ కార్చిచ్చు రగులుతోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







