కువైట్:ఆన్ లైన్ లోనే ప్రవాసీయుల రెసిడెన్సీ రెన్యూవల్..త్వరలోనే అమలు

- January 08, 2020 , by Maagulf
కువైట్:ఆన్ లైన్ లోనే ప్రవాసీయుల రెసిడెన్సీ రెన్యూవల్..త్వరలోనే అమలు

కువైట్:ఆన్ లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ను సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్న కువైట్ ప్రభుత్వం త్వరలోనే ప్రవాసీయుల రెసిడెన్సీ రెన్యూవల్ ను కూడా ఆన్ లైన్ లోనే చేపట్టనుంది. ఈ దిశగా అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ఆర్టికల్ 20 రెసిడెన్సీ పర్మిట్స్ ప్రకారం 9000 మంది డొమెస్టిక్ వర్కర్స్ రెసిడెన్స్ రెన్యూవల్ చేసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే..గత ఏడాది నవంబర్ 2019 నుంచి అమలులోకి వచ్చిన ఆన్ లైన్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ విధానం మంచి ఫలితాలను అందిస్తోంది. గత నెల రోజుల్లోనే దాదాపు 17 వేల మందికి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసినట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఆన్ లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం మినిస్ట్రి ఆఫ్ ఇంటీరియర్ వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వివిధ అవెన్యూ మాల్స్, అల్ కౌట్ మాల్స్ లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మిషెన్ల నుంచి లైసెన్స్ తీసుకోవచ్చు. అలాగే పాత లైసెన్స్ సబ్మిట్ చేసి కొత్త లైసెన్స్ కార్డులను కూడా పొందవచ్చు. అయితే..కొత్త లైసెన్స్ కోసం పెండింగ్ లో ట్రాఫిక్ వయోలేషన్ ఫైన్స్ ను క్లియర్ చేయాల్సి ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com