50 ఏళ్ల పాటు UAEని రిప్రజెంట్ చేసే కొత్త లోగో రిలీజ్
- January 08, 2020
యూఏఈ బ్రాండ్ ఇమేజ్ చాటేల కొత్త లోగో రిలీజ్ అయ్యింది. దుబాయ్ వైస్ ప్రెసిడెంట్/ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, అబూ ధాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కొత్త లోగోను ఆవిష్కరించారు. ఇప్పటి మరో 50 ఏళ్ల పాటు ఇదే లోగో యూఏఈని రిప్రజెంట్ చేయనుంది. కొత్త లోగోకు సంబంధించి షేక్ మొహమ్మద్ తన ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశారు. ఎమిరాతి స్ఫూర్తి చాటేలా ఇక నుంచి అన్ని సంస్థలు, అన్ని సెక్టార్స్ లో లోగోను వినియోగించటం స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు. 'ఈ రోజు నేను, సోదరుడు మొహమ్మద్ బిన్ జయాద్, 49 మంది ఎమిరాతి ఇన్నోవేటర్స్ కలిసి యూఏఈ ఐడెంటిని చాటేలా లోగోను విష్కరించాం. మన అభివృద్ధి లక్ష్యాలను సూచికగా నిలుస్తుంది. ప్రపంచ దేశాలతో ఏడు ఎమిరేట్స్ పోటీతత్వానికి స్ఫూర్తిగా నిలుస్తుంది' అని షేక్ మొహమ్మద్ అన్నారు.
లోగో డిజైనింగ్ లో ఏడు ఎమిరేట్స్ నుంచి మొత్తం 49 ఎమిరాతి డిజైనర్స్ కలిసి మూడు లోగోలను రూపొందించారు. ఈ మూడు లోగోల నుంచి ఒక దాన్ని ఎంపిక చేసేందుకు ఆన్ లైన్ లో ఓటింగ్ నిర్వహించగా 10 మిలియన్ల ఓట్లు పోలయ్యాయి. వీరిలో మెజారిటీ ఓటర్ల ఎంపిక మేరకు మూడు లోగోల్లో ఒక లోగోను ఫైనల్ చేశారు. అయితే..ఓటింగ్ లో పాల్గొన్న 10 మిలియన్ల మందికి సూచికగా పది మిలియన్ల మొక్కలను నాటుతామని షేక్ మొహమ్మద్ తెలిపారు.

తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







