సిటీ సెంటర్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం
- January 09, 2020
బహ్రెయిన్: సీఫ్‌లోని సిటీ సెంటర్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా విజిటర్స్ ఆందోళనకు గురయ్యారు. సివిల్ డిఫెన్స్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ముందుగా విజిటర్స్‌ని ఖాళీ చేయించిన అధికారులు, ఆ తర్వాత మంటల్ని అదుపు చేశారు. కాగా, ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మినిస్టర్ జాయెద్ అల్ జయానీ, ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఓ రెస్టారెంట్ చిమ్నీ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కేవలం 55 నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మాల్ యాజమాన్యం తీసుకున్న చర్యలు అమోఘమనీ, తిరిగి మాల్‌లో కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతున్నాయని మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







