“దర్బార్” మూవీ రివ్యూ

“దర్బార్” మూవీ రివ్యూ

తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఏ ఆర్ మురుగ దాస్ ల కాంబినేషన్ లో సంక్రాంతి పండుగను మొదటగా స్టార్ట్ చేసిన స్టైలిష్ కాప్ డ్రామా చిత్రం “దర్బార్”. రజినీ మరియు మురుగదాస్ ల కాంబోలో మొట్టమొదటి సారి తెరకెక్కిన చిత్రం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి బజ్ నడుమ ఈ చిత్రం ఈరోజు నాలుగు భాషల్లో విడుదల అయ్యింది.మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :
కథలోకి వెళ్లినట్టయితే ఆదిత్య అరుణాచలం(రజినీకాంత్) మాంచి యాటిట్యూడిక్ పోలీస్ ఆఫీసర్.ఢిల్లీ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు.ఇదే నేపథ్యంలోమెయిన్ విలన్ హరి చోప్రా(సునీల్ శెట్టి) పేరు మోసిన డాన్ గా ఒక మాఫియాను నడిపిస్తుంటాడు.అయితే కథలో ఈ ఇద్దరికీ ఉన్న సంబంధం ఏమిటి?వీరిద్దరికీ ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా?అస్లు సునీల్ శెట్టి ఏం చేస్తుంటాడు.? ఈ కథలో నివేతా థామస్ పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంది?మొట్టమొదటి సారి రజినీను మురుగదాస్ ఎలా చూపించారు అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :
మాములుగా రజిని అంటేనే స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ అలాంటి రజినీను మళ్ళీ చాలా కాలం తర్వాత తండైన వింటేజ్ లుక్స్ లోనూ అలాగే తన డైలాగ్ మాడ్యులేషన్ తో అప్పటి కొన్ని డైలాగ్స్ ను మురుగదాస్ పలికించి తలైవర్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తారు.అలాగే రజినీ వన్ మేన్ షోతో ఒక స్టైలిష్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా రజినీ ఫ్యాన్స్ ఆయన్నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ ఉండేలా రజినీ నుంచి దర్శకుడు మురుగదాస్ రాబట్టారు.అంతే కాకుండా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ అలాగే అక్కడ స్టార్ కమెడియన్ యోగిబాబు మరియు రజినీల మధ్య కామెడీ ట్రాక్స్ బాగుంటాయి.

అలాగే రజినీ మరియు నయనతారల మధ్య కెమిస్ట్రీ కానీ ఇలా అంతా డీసెంట్ గా కథనం సాగిపోతుంది.అయితే మాములుగా మురుగదాస్ అంటే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు కూడా కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.వాటిని ఫస్ట్ హాఫ్ లో మురుగదాస్ అందుకోలేకపోయారు.ఆయన తీసిన అన్ని చిత్రాలు ఏదొక అదిరిపోయే కాన్సెప్ట్ తో ఉంటుంది అలా దాన్ని అద్భుతమైన నరేషన్ తో ప్రేక్షకుడు ఎంజాయ్ చేసే ప్రేక్షకుడు ఈ చిత్రంలో అవి ఎందుకో తక్కువయ్యాయి అనిపిస్తుంది.ఈ విషయంలో మురుగదాస్ కాస్త కొత్తగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.

దాని మూలంగా కేవలం రజినీ మాత్రమే హైలైట్ అయ్యారు కానీ చిత్రంలోని మరే ఇతర అంశాలు అంత గొప్పగా అన్పించకపోవచ్చు.అయితే ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంది అనుకుంటే సెకండాఫ్ లో కూడా అంత కొత్తదనం ఏమి ఉండదు.రెగ్యులర్ కాప్ డ్రామాలానే అనిపిస్తుంది.ఇది కాస్త నిరాశ కలిగించే అంశమే అని చెప్పాలి.కథానుసారం వచ్చే ఫైట్స్,ఎమోషనల్ సీన్స్ , రజిని మార్క్ ఎలివేషన్ సీన్స్ బాగానే ఉంటాయి.కానీ ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది.హీరోయిన్ నయన్ మరియు నివేతల మంచి నటన కనబర్చారు.అలాగే విలన్ రోల్ లో కన్పించిన సునీల్ శెట్టి పర్ఫెక్ట్ విలనిజం చూపించారని చెప్పాలి.అలాగే అనిరుద్ సాంగ్స్ విజువల్ బాగున్నాయి.అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా “పేట” తర్వాత ఈ చిత్రానికి బాగా ఇచ్చారు.

ప్లస్ పాయింట్స్ :
రజినీకాంత్ అదిరిపోయే పెర్ఫామెన్స్
కొన్ని ఎలివేషన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
అంత ఆసక్తిగా సాగని స్క్రీన్ ప్లే

తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే రజినీ మరియు మురుగదాస్ ల కాంబో తెరకెక్కిన మొట్టమొదటి స్టైలిష్ కాప్ డ్రామా “దర్భార్” రజినీ మార్క్ ఎలివేషన్ సీన్స్ తో ఫ్యాన్స్ కు మీల్స్ అందినా రొటీన్ కథ మరియు కథనాలు దెబ్బ తీశాయి.తన ప్రతీ చిత్రంలో మంచి కాన్సెప్ట్ తో అలరించే మురుగదాస్ ఈ చిత్రంలో ఎందుకో మిస్ చేసారు అయినా రొటీన్ స్టోరీ తీసినా సరే బాగానే తెరకెక్కించారని చెప్పొచ్చు.కానీ రజినీ మాత్రం వన్ మాన్ షో చూపించారు.ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని ఓ సారి చూడొచ్చు. 

మాగల్ఫ్.కామ్ రేటింగ్ : 2.5/5

Back to Top