గల్ఫ్ దేశాలకు సురక్షితంగా వెళ్ళండి..శిక్షణ పొంది వెళ్ళండి

- January 09, 2020 , by Maagulf
గల్ఫ్ దేశాలకు సురక్షితంగా వెళ్ళండి..శిక్షణ పొంది వెళ్ళండి

తెలంగాణ:ప్రవాసి భారతీయ దివస్ ను సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గురువారం (09.01.2020) గాంధీ విగ్రహానికి పూలమాల వేసి గల్ఫ్ వలసలపై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. 

ఈ సందర్బంగా ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ కొండ భానుచందర్ మాట్లాడుతూ 9 జనవరి 1915 న మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి భారత్ కు వాపస్ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2003 నుండి ప్రతి ఏటా ప్రవాసి భారతీయ దివస్ నిర్వహిస్తున్నదని భానుచందర్ అన్నారు. 

ఉపాధికోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న మన వలసకార్మికులు కనీస ప్రాథమిక హక్కులను  కాపాడుకోవాలి. సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం తగిన జాగ్రత్తలు పాటించాలి. అక్రమ పద్దతిలో విదేశాలకు వెళ్ళకూడదు. నకిలీ గల్ఫ్ ఏజెంట్లు, మోసపూరిత కంపెనీల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వలస అనేది అభివృద్ధి మార్గం కావాలని ఖతార్ లోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ఉపాధ్యక్షులు తోట ధర్మేందర్  పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పోతుగల్ గ్రామసర్పంచ్ తన్నీరు గౌతంరావు, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, ఎంపీటీసీ కోండేని బాలకిషన్, టిఆర్ఎస్ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు భూంపెల్లి సురేందర్ రావు, నాయకులు గీసి శంకర్, బైతి నవీన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దిగారి శ్రీనివాస్, శరణ స్వచ్ఛంద సేవా సంస్థ నాయకుడు కోల కృష్ణ,ముస్తాబాద్ మండల మున్నూరు కాపు నాయకుడు చెక్కపెల్లి నాగారాజు, గ్రామ ప్రజలు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com