బ్రిటన్ రాజకుటుంబ బాధ్యతల నుంచి వైదొలగుతామన్న హ్యారీ-మేఘన్ జంట
- January 09, 2020
బ్రిటీష్ రాచ కుటుంబంలో చీలికలు మొదలయ్యాయి. ప్రిన్స్ హ్యారీ, భార్య మేఘన .. రాచ కుటుంబం నుంచి వేరుపడనున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు ఓ లేఖ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. రాచకుటుంబంలో సీనియర్ సభ్యులుగా ఉండాలన్న ఉద్దేశం తమకులేదని ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాము ఒంటరిగా, ఆర్థికంగా బలోపేతం కావాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యారీ భార్య మేఘన్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది బ్రిటీష్ రాచకుంటుంబీకుల మధ్య కొంత అగాధం ఏర్పడింది, దీంతో కొన్ని నెలలుగా ఈ అంశాన్ని చర్చించామని, ఇక ఒంటరిగా బ్రతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రిన్స్ హ్యారీ తెలిపారు. ఉత్తర అమెరికాలో తాము కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాచకుటుంబంలో పెద్దలను ఎవర్నీ సంప్రదించకుండానే ప్రిన్స్ హ్యారీ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొన్నది. ప్రిన్స్ హ్యారీ దంపతుల నిర్ణయం పట్ల క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ చార్లెస్ నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







