నో పార్కింగ్ జోన్ లో వెహికిల్స్ పార్క్ చేస్తే Dh500 ఫైన్

- January 10, 2020 , by Maagulf
నో పార్కింగ్ జోన్ లో వెహికిల్స్ పార్క్ చేస్తే Dh500 ఫైన్

యూ.ఏ.ఈ:షాపింగ్ ఏరియాల్లో, ఇతర ప్రాంతాల్లో మోటరిస్ట్ లు ఇష్టానుసారంగా వెహికిల్స్ పార్క్ చేయటం ట్రాఫిక్ కు డిస్ట్రబెన్స్ గా మారింది. అక్రమ పార్కింగ్ వల్ల మిగిలిన వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులు ప్రమాదాలపై షార్జా పోలీసులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. నాన్-డిసిగ్నేటెడ్ ఎరియాలో వాహనాలను పార్క్ చేయొద్దని హెచ్చరించారు. ఆర్టికల్ 98 ప్రకారం రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా వెహికిల్స్ పార్క్ చేస్తూ..ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తే 500 దిర్హామ్ ల ఫైన్ విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా షాప్ ల ముందు సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని, అడ్డదిడ్డంగా వాహనాలను పార్క్ చేస్తున్నారని వీడియో ద్వారా ప్రజలకు వివరించారు.

నిలిపి ఉన్న కార్ల పక్కన సర్వీసు లేన్లను ఆక్రమిస్తూ వెహికిల్స్ పార్క్ చేస్తుండటంతో మిగిలిన వాహనాదారులకు దారి ఉండటం లేదు. రోడ్ల మీదుగా వాహనాలు నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్ జాం అవుతోందని పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో స్పష్టం అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com