తగ్గిన బంగారం, వెండి ధరలు!
- January 10, 2020
ఇండియా:బంగారం ధరలు.. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతాయి. ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గుతాయి. ఇలా రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే బంగారం ఈ మధ్యకాలంలో దారుణంగా తయారు అయ్యింది. ఒకసారి 20 రూపాయిలు బంగారం తగ్గితే మరుసటి రోజు 200 రూపాయిలు పెరుగుతుంది. గత వారం నుండి బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.
నేడు శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,070 రూపాయిల తగ్గుదలతో 41,790 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 970 రూపాయిల తగ్గుదలతో 38,300 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర కూడా భారీగా తగ్గింది.
దీంతో కేజీ వెండి ధర ఏకంగా 1500 రూపాయిలు తగ్గుదలతో 49,500 రూపాయిల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పసిడి ప్రేమికులు బంగారం కావాల్సినంత కొంటారో చూడాలి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







