దుబాయ్ రెసిడెంట్స్,ఈ నెంబర్ నుంచి వచ్చే కాల్స్‌ని ఆన్సర్ చేయొద్దు
- January 10, 2020
దుబాయ్:ఎమిరేట్స్ ఐడీ అథారిటీ నుంచి వస్తున్నట్లుగా చెబుతున్న ఓ ఫోన్ కాల్, ఆయా వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు మాయమవడానికి కారణమవుతోంది. దుబాయ్ రెసిడెంట్ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ, ఓ ఫోన్ కాల్ తనకు వచ్చిందనీ ఎమిరేట్స్ ఐడీకి సంబంధించిన వివరాల్ని వెరిఫై చేస్తున్నామని చెప్పారని తెలిపారు. వివరాలు చెప్పిన తర్వాత తన ఫోన్ నెంబర్‌కి వన్ టైమ్ పాస్వర్డ్ వచ్చిందనీ, దాన్ని ఆ వ్యక్తితో పంచుకోగానే, తన బ్యాంక్ నుంచి డబ్బుని అవతలి వ్యక్తి విత్‌డ్రా చేసే ప్రయత్నం జరిగిందని అన్నారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో తన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవని చెప్పారు ఆ వ్యక్తి. తన అనుభవం గురించి వివరిస్తూ ఇతరులెవరూ ఈ ట్రాప్‌లో పడొద్దని ఆ వ్యక్తి వివరించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







