టెహ్రాన్:ఉక్రెయిన్ విమానం కూలిపోలేదు..కూల్చేశారు!
- January 11, 2020
ఇరాన్ చేసిన ఓ పొరబాటు తిరిగి పూడ్చుకోలేని భారీ నష్టాన్ని మిగిల్చింది. 176 మంది కుటుంబాల్లో విషాదం నింపింది. అవును, ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో ఇలాంటి చేదు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అది ప్రమాదం కాదని, క్షిపణి దాడి చేయటంతో కూలిపోయిందని స్వయంగా ఇరాన్ ప్రకటించింది. అయితే..అది తాము ఉద్దేశపూర్వకంగా చేయలేదని, బోయింగ్ విమానం తమ మిలటరీ స్థావరాలపై దాడికి వస్తున్నట్లు తప్పుగా అర్ధం చేసుకోవటం వల్లే ఈ దిద్దుకోలేని పొరబాటు జరిగిందని తన ప్రకటనలో వెల్లడించింది. గత 8న టెహ్రాన్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఉక్రేయిన్ కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 176 మంది చనిపోయారు. కెనడాకు చెందిన 63 మంది, ఇరాన్ కు చెందిన 82 మంది ప్రయాణికులు ఉన్నారు. తమ దేశ పౌరులు చనిపోవటంతో కెనడా ఫ్లైట్ యాక్సిడెంట్ ను ముందు నుంచి సీరియస్ గా తీసుకుంది. బ్లాక్ బాక్స్ వివరాలు సేకించేందుకు ప్రయత్నించింది. అయితే..బ్లాక్ బాక్స్ దాచేసి విషాదాన్ని ప్రమాదంగానే ప్రచారం చేసేందుకు ప్రయత్నించినా..కెనెడా మాత్రం నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చే వరకు వదల్లేదు. తమ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు 2 క్షిపణులతో దాడి జరిగినట్లు కెనెడా ముందు నుంచి వాదిస్తూ వస్తోంది. దీంతో పాటు ప్రమాదానికి ముందు ఫ్లైట్ ను మిస్సైల్స్ ఢికొట్టే వీడియోలు బయటికి రావటతో ఇరాన్ చిక్కుల్లో పడింది. చివరికి
నిజాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే..అమెరికా దుందుడుగు చర్యల వల్లే ఈ తప్పిదం జరిగిందని ఇరాన్ చెబుతోంది.
ఇంటర్నేషన్ కోర్టు ముందుకు బాధ్యులను ప్రవేశపెట్టాల్సిందే..శిక్షించాల్సిందే!
ఫ్లైట్ ప్రమాదంపై ఇరాన్ తమ తప్పును అంగీకరించిన తర్వాత ఉక్రేయిన్ సీరియస్ గా రియాక్ట్ అయింది. విమానాన్ని కూల్చివేసిన ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని ఇంటర్నేషనల్ కోర్టు ముందుకు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. వారిని శిక్షించి..ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమి జెలన్స్కీ డిమాండ్ చేశారు. కెనడా ప్రధాని జెస్టిన్ ట్రూడో కూడా ఇరాన్ ప్రకటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు పారదర్శకంగా ఇరాన్ న్యాయం చేయాలని ట్రూడో డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







