రియాద్‌ సీజన్‌.. గ్రాండ్‌ ఫినాలేపై పెరిగిన అంచనాలు

- January 11, 2020 , by Maagulf
రియాద్‌ సీజన్‌.. గ్రాండ్‌ ఫినాలేపై పెరిగిన అంచనాలు

రియాద్‌: రియాద్‌ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలె జనవరి 16న కింగ్‌ ఫహాద్‌ స్టేడియంలో జరగనుండగా, ఈ ఫినాలేపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సౌదీ అరేబియా సీజన్‌ సిరీస్‌లో మోస్ట్‌ ఎక్సైటింగ్‌ ఈవెంట్‌గా 'లీలా ది ల్యాండ్‌ ఆఫ్‌ ఇమేజినేషన్‌ - ఫమాద్‌ స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్‌ పట్ల ఉత్సాహం నెలకొంది. లీలా అనే యంంగ్‌ గర్ల్‌ డ్రీమ్‌ ఈ షో ప్రత్యేకత. ఆమె అడ్వెంచర్స్‌లో ఆడియన్స్‌ బాగమయ్యేందుకు ఆ షో ఆస్కారం కల్పిస్తుంది. సౌదీ అరేబియా హిస్టరీని ఈ షోలో ప్రతిబింబించనున్నారు. బాలిచ్‌ వరల్డ్‌ వైడ్‌ షోస్‌ (బిడబ్ల్యుఎస్‌), ఈ షో స్ట్రాటజిక్‌ పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారు. 89వ సౌదీ నేషనల్‌ డే సందర్భంగా 'ఇన్‌స్పిరేషన్‌ రోడ్‌' పేరుతో షో నిర్వహించాక, ఈ సంస్థ నుంచి వస్తోన్న మరో షో ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com