డోర్ మాట్లపై గణేశ్ చిత్రాలు..అమెజాన్ ను దులిపేస్తున్న నెటిజన్లు...
- January 12, 2020


న్యూఢిల్లీ: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టిల్లు భారతదేశం. అలాంటిది హిందువులు ఎంతో ఆరాధనగా పూజించే దేవుళ్ల చిత్రాలను కాలి కింద వేసుకునే డోర్ మ్యాట్లు, కప్పుకునే రగ్గులపై ముద్రించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్. దీంతో భారత వినియోగదారులు అమెజాన్ సంస్థపై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు.
దీని పర్యవసానంగా ప్రస్తుతం ట్విటర్‌లో బాయ్‌కాట్ అమెజాన్ అనేది ట్రెండింగ్‌లో నిలిచింది. అమెజాన్ వెబ్‌సైట్‌లో వినాయకుడు, శివుడు, ఓంకారం గుర్తులతో డోర్‌మ్యాట్లు, బాత్రూం రగ్స్ దర్శనమిచ్చాయి వీటితోపాటు భారత జాతీయ జెండాతో కూడిన డోర్‌మ్యాట్స్ కనిపించాయి.
దీంతో షాక్‌కు గురైన భారతీయులు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, భారత్‌ను అవమానిస్తున్నారంటూ అమెజాన్‌పై నిప్పులు చెరిగారు. ‘సంస్కృతిని గౌరవించడం తెలీకపోయినా అవమానించడం మానుకోండి’ అని నెటిజన్లు ఘాటుగా విమర్శించారు.
‘మన సంస్కృతిని కించపరుస్తున్న అమెజాన్‌ను బహిష్కరిద్దాం’ అని నెటిజన్లు పిలుపునిచ్చారు. దీంతో ట్విటర్‌లో ప్రస్తుతం #BoycottAmazon అనేది ట్రెండింగ్‌గా నిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అమెజాన్ తాజాగా వివాదానికి కారణమైన వస్తువులను వెబ్‌సైట్ నుంచి తొలగింది.
కాగా అమెజాన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవుని ఫొటోలు, జాతీయ జెండాను ముద్రించిన డోర్‌మ్యాట్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే.
మతపరమైన భావోద్వేగాలతో అమెజాన్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2019 మేలోనూ హిందూ దేవుళ్ల ఫోటోలు ముద్రించిన అమెజాన్ టాయిలెట్ సీట్ కవర్లు, మ్యాట్లను తన వెబ్ సైట్ లో విక్రయానికి పెట్టింది. అంతకుముందు 2017లో అమెజాన్ కెనడా వెబ్ సైట్ లో త్రివర్ణ పతాకం ముద్రించిన డోర్ మ్యాట్లను తయారు చేసి విమర్శల పాలైంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







