అమెరికా దళాల 'ఇరాక్ ఎయిర్ బేస్'పై రాకెట్ల దాడి:మిలిటరీ
- January 12, 2020
ఇరాక్:ఇరాక్‌లోని బలాడ్ వైమానిక స్థావరంపై జరిగిన రాకెట్ల దాడిలో కనీసం నలుగురు సైనికులు గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్రాధమిక నివేదికల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ దళాలకు ఆతిథ్యమిస్తున్న ఇరాక్ యొక్క బలాడ్ ఎయిర్ బేస్ లోపల ఆదివారం ఏడు మోర్టార్ బాంబులు పడ్డాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బాగ్దాద్‌కు ఉత్తరాన 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) దూరంలో ఉన్న బేస్ లోపల ఉన్న రన్‌వేలో మోర్టార్ బాంబులు పడ్డాయని సైనిక వర్గాలు తెలిపాయి. బలాద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు ఇరాకీ సైనికులు గాయపడ్డారు.
గత రెండు వారాలుగా అమెరికా మరియు ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బాగ్దాద్‌కు ఉత్తరాన ఉన్న అల్-బలాద్ ఎయిర్‌బేస్‌లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళంలో ఎక్కువ మంది అక్కడినుండి వెళ్లిపోయారని సైనిక వర్గాలు తెలిపాయి. ఇరానియన్ జనరల్ ఖాసిం సులేమాని హత్య తరువాత అమెరికా మరియు ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో యునైటెడ్ స్టేట్స్ దళాలకు ఆతిథ్యమిచ్చే సైనిక స్థావరాలు గత కొద్ది రోజులుగా రాకెట్, మోర్టార్ దాడులకు గురయ్యాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







