భారతీయులకు బంపర్ ఆఫర్.. ఈ దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్.!
- January 13, 2020
విదేశాలకు టూర్ ప్లాన్ చేసే భారతీయులకు 58 దేశాలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. వీసా సమస్య లేకుండానే తమ దేశాల్లో పర్యటించడానికి అనుమతులు ఇస్తున్నాయి. సాధారణంగా విదేశాలకు టూర్ కోసమైనా.. లేక చదువు కోసం వెళ్లాలన్నా వీసా తప్పనిసరిగా అవసరమవుతుంది. కొన్నిసార్లయితే వీసా సమస్యల వల్ల ప్రయాణాలు కూడా ఆగిపోతుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఇండియన్ పాస్‌పోర్టు మరింత పటిష్టంగా మారడంతో చాలా దేశాలు భారతీయులకు వీసా లేకుండానే పర్యటించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. హెన్లే పాస్ పోర్ట్ 2020 నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని పవర్ఫుల్ పాస్పోర్ట్స్ లిస్టులో మన భారత పాస్‌పోర్టు 84వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఈ జాబితాలో జపాన్ పాస్‌పోర్టు అగ్రస్థానంలో ఉండగా.. దానితో ఈజీగా 191 దేశాలను వీసా లేకుండా సందర్శించే అనుమతి ఉంది.
ఇక సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్ పోర్టులతో కూడా ప్రపంచంలోని దాదాపు 150 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ చేయవచ్చు. ఈ లిస్టులో ఇండియా దక్షిణ ఆసియాలోనే టాప్ ర్యాంక్ దక్కించుకోగా.. మన పాస్పోర్టుతో 58 దేశాలు అదే విధంగా చుట్టేసేయొచ్చు. అంతేకాకుండా మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో 15 రోజుల పాటు ప్రయాణించడానికి ఉచిత ఆన్లైన్ వీసా కూడా లభిస్తుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!