దుబాయ్‌లో భారతీయ మహిళ మ్యూజికల్ రికార్డు!

- January 13, 2020 , by Maagulf
దుబాయ్‌లో భారతీయ మహిళ మ్యూజికల్ రికార్డు!

దుబాయ్ లో భారత్ కు చెందిన 48ఏళ్ల మహిళ మ్యూజికల్ రికార్డు సృష్టించింది. 1000 రోజుల్లో 1000 పాటలను పాడి తన మార్క్ ను సాధించింది. వెయ్యి రోజుల్లో అన్ని పాటలను రాయడం... మ్యూజిక్ కంపోజ్ చేయడం.. పాటలు పాడి రికార్డు చేయడమంతా ఆమె చేసినట్టు అక్కడి మీడియా రిపోర్టు తెలిపింది.

వెయ్యి రోజుల్లో వెయ్యి వరకు పాటలు పాడిన స్వప్న అబ్రహాం (48) గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందడమే కాకుండా నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 8, 2017 నుంచి జనవరి 2, 2020 వరకు ఆమె మొత్తం వెయ్యి రోజుల్లో పాటలు రాయడం, పాడటం, కంపోజ్ చేసి రికార్డు చేసినట్టు రిపోర్టు నివేదించింది.

డిజిటల్ అల్బమ్ లో అత్యధిక పాటలు పాడిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు కోసం స్వప్న దరఖాస్తు కూడా చేసుకున్నారు. నిజానికి అబ్రహాం.. 1000కి పైగా పాటలు పాడారు. పిల్లల కోసం వరసగా వెయ్యి రోజులు అదనంగా పాటలు పాడారు.

మూడో, నాల్గో, ఐదోవ పాటను పాడుతూ.. ఇలా ఒక రోజులో 22 పాటలను పూర్తి చేసింది. దుబాయ్ లోని మేనేజ్ మెంట్ కన్సెల్టింగ్ సంస్థలో అబ్రహాం ఉద్యోగినిగా పనిచేస్తోంది. 1000 రోజుల్లో 1000 పాటలు పాడి తన సుదీర్ఘ మ్యూజిక్ కెరీర్ ను ముగించాలని ఆమె ఆకాంక్షించారు. 24 ఏళ్ల పాటు మ్యూజిక్ ప్రొఫెషనల్ గా కొనసాగినా అబ్రహాం.. 22 అల్బామ్ లను పబ్లీష్ చేసింది.

మ్యూజిషియన్ గా నేరవేరని వ్యక్తిని, ఒక ఆర్టిస్టుగా మాత్రమే. నేను అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. అందుకే రోజుకు ఒక పాట చొప్పున 1000 రోజుల్లో పాటలు పాడి రికార్డు సృష్టించి ఆ తర్వాతే మ్యూజిక్ వదిలేయాలని నిర్ణయించుకున్నాను’ అని అబ్రహాం చెప్పినట్టు గల్ఫ్ న్యూస్ తెలిపింది.

ఆమె పాడిన అన్ని పాటలు ఒరిజినల్ మాత్రమే కాదు.. ఎంతో అర్థవంతమైనవి కూడా. ఇందుకోసం 1000 వరకు థీమ్స్ లేదా స్టోరీలను (అదనంగా పాటలను పాడుతూనే) ముగింపు లేని లిరిక్స్ క్రియేట్ చేసి మ్యూజికల్ రికార్డు నెలకొల్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com