ఉరి కన్ఫామ్ చేస్తూ నిర్భయ దోషులకు షాక్ ఇచ్చిన సుప్రీం

ఉరి కన్ఫామ్ చేస్తూ నిర్భయ దోషులకు షాక్ ఇచ్చిన సుప్రీం

నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. నిర్భయ దోషులు వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీం. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని క్యూరేటివ్ పిటిషన్‌లో సుప్రీంని కోరారు నిర్భయ దోషులు. అయితే.. ఈ క్యూరేటివ్ పిటిషన్‌ విచారణకు ఈ దోషులు అర్హులు కారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు నలుగురు దోషులకు డెత్ వారెంట్‌లు జారీ చేసింది. ఈ నెల 22న ఉరిశిక్షను అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఉదయం 7 గంటలకు నలుగురిని ఉరితీయాలని కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెల 22న ఈ నలుగురికి ఉరిశిక్ష అమలు అవుతుంది. ఐదుగురు జడ్జిల బెంజ్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖేష్, పవన్ గుప్తా, వినయ్, అక్షయ్‌లను ఉరితీయాలని పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. దీంతో.. ఢిల్లీలో 7 ఏళ్ల క్రితం జరిగిన జరిగిన కేసులో నలుగురు దోషులను ఉరితీయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దేశ చరిత్రలో ఒకే సారి నలుగురు దోషులను ఉరి తీయబోతున్నారు అధికారులు. కాగా తీహార్ జైలులో ఇప్పటికే దీని కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తీహార్ జైలులో గతంలో ఒకే ఉరి కంభం ఉండేది. కానీ ఇప్పుడు హుటాహుటిన నాలుగు ఉరి కంభాలను సిద్ధం చేశారు అధికారులు.

కాగా నిర్భయ దోషుల క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించింది. చరిత్రలో ఇది మరచిపోలేని రోజని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది నాకు అత్యంత బిగ్‌ డే అని మీడియాతో మాట్లాడారు. గత 7 సంవత్సరాలుగా నేను చట్టం కోసం పోరాడుతున్నా.. ఇప్పటికి నా కల తీరిందని ఆవిడ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరి తీస్తున్నారని ఆశాదేవి పేర్కొన్నారు.

Back to Top