అస్కార్ రేసులో ఖతార్ మూవీస్

- January 14, 2020 , by Maagulf
అస్కార్ రేసులో ఖతార్ మూవీస్

దోహా ఫిల్మ్ ఇన్సిట్యూట్  సపోర్ట్ తో వచ్చిన రెండు ఖతార్ సినిమాలు ఈ ఏడాది అస్కార్ బరిలో నిలిచాయి. డాక్యుమెంటరీ విభాగంలో "ది కేవ్" అస్కార్ పోటీలో నిలవగా..లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ రేసులో "బ్రదర్ హుడ్" అస్కార్ కు నామినేట్ అయ్యింది. సిరియా సివిల్ వార్ నేపథ్యంతో ది కేవ్ డాక్యుమెంటరీని దర్శకుడు ఫెరాస్ ఫయ్యద్ తెరకెక్కించాడు. భయంకరమైన యుద్ధ వాతావరణంలో బాంబు దాడుల్లో గాయపడిన వారికి సిరియన్ డాక్టర్ అమని బల్లౌర్ అండర్ గ్రౌండ్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తుంటాడు. గుహా మాదిరిగా సీక్రెట్ ఆస్పత్రిలో వేలాది మంది ప్రాణాలను రక్షించేందుకు చేసిన ప్రయత్నాన్నే "ది కేవ్" గా డాక్యుమెంటరీ రూపొందించారు. డైరెక్టర్ ఫెరాస్ ఫయ్యద్ -లాస్ట్ మెన్ ఇన్ అలప్పో-మూవీకి గాను బెస్ట్ డైరెక్టర్ గా 2018లో ఆస్కార్ కు నామినేట్ అయ్యాడు. కానీ, ఆస్కార్ మాత్రం కొద్దిలో చేజారిపోయింది.  

దోహా ఫిల్మ్ ఇన్సిట్యూట్ కో ఫైనాన్సియర్ గా నిర్మించిన "బ్రదర్ హుడ్" లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ గా అస్కార్ కు నామినేట్ అయ్యింది. కుటుంబ బాధ్యతలు, నమ్మిన సిద్దాంతాల మధ్య చిక్కుకున్న ఓ ట్యూనిషియన్ ఫాదర్ గురించి పదునైన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటికే 48 దేశాల్లో 60 అవార్డులు దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ నిలిచింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com