నిజమైన స్నేహితుడికి అసలైన నివాళి
January 14, 2020
మస్కట్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ బిన్ తైమౌర్ మృతి పట్ల భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు సంతాప దినాన్ని కూడా భారతదేశంలో నిర్వహించడం జరిగింది. సుల్తాన్ కబూస్, భారతదేశానికి అత్యంత ఆప్తమిత్రుడని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. భారత్ - ఒమన్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగవడంలో కబూస్ పాత్ర చాలా గొప్పదని నరేంద్ర మోడీ చెప్పారు. కాగా, భారతదేశం, సుల్తాన్ కబూస్‌కి ఇచ్చిన ఈ గౌరవం పట్ల ఒమన్ హర్షం వ్యక్తం చేసింది. కష్ట కాలంలో ఒమన్‌కి భారత్ అందిస్తోన్న నైతిక మద్దతు చాలా గొప్పదని ఒమన్ కొనియాడుతోంది.