కువైట్ సిటీ: మద్యంమత్తులో యాక్సిడెంట్ చేసిన కువైట్ దంపతుల అరెస్ట్
- January 16, 2020
మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ సిమెంట్ బారియర్ ను ఢికొట్టిన భార్యభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కారును చేజ్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో కారను వేగంగా డ్రైవ్ చేయటం వల్లే యాక్సిడెంట్ జరిగినట్లు అధికారులు. ప్రమాద గురించి ఇంటిరియర్ మినిస్ట్రి ఆపరేషన్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ అందగానే పోలీసులు, పారామెడిక్స్ స్పాట్ చేరుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..ప్రమాదంపై వారిని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులు తమను చేజ్ చేసేందుకు ప్రయత్నించడంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరిగిందని దంపతులు తెలిపారు. దీనిపై ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే..తమను ఉద్దేశించి అశ్లీలంగా హ్యాండ్ గెస్టర్స్ చేశారని అందుకే తాము వెంబడించాల్సి వచ్చిందని ఆ ఇద్దరు వ్యక్తులు వివరించారు. దీంతో పోలీసులు భార్య భర్తలిద్దర్ని అరెస్ట్ చేసి తదుపరి లీగల్ యాక్షన్ కు పంపించారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం