నువైసీబ్‌ని దాటిన 4 మిలియన్ వాహనాలు
- January 16, 2020
కువైట్ సిటీ: అల్ నువైసీబ్ కస్టమ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019లో 2,075,55 వాహనాలు దేశంలోకి రాగా, 2,086,365 వాహనాలు దేశం నుంచి బయటకు వెళ్ళాయి. వీటిల్లో ప్రైవటు వాహనాలు, ట్రక్కులు వున్నాయి. గత డిసెంబర్‌లో అత్యధికంగా ఈ ప్రాంతం నుంచి వాహనాల మూమెంట్ కనిపించింది. 400,000కి పైగా వాహనాలు డిసెంబర్‌లో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించినట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే దేశంలోకి రాకపోకలకు అనుమతిస్తున్నట్లు నువైసీబ్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ బిలాల్ అల్ ఖమీస్ చెప్పారు. 2 మిలియన్లకు పైగా సిగరెట్ ప్యాకెట్లు ఈ తనిఖీల్లో పట్టుబడ్డాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







