డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్
- January 16, 2020
తెలుగు వారి పెద్ద పండుగ జనవరి 16 కనుమతో ముగుస్తుంది. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఈ సంక్రాంతిని మరో రోజు పొడిగించాడు. అవును, అసలు మేటర్ ఏంటంటే.. ప్రభాస్ 'సాహో' తర్వాత 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే విదేశాల్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాకు 'జాన్' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా.. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి మూవీ టీమ్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తితో ఉన్నారు.
చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ 'జాన్' మూవీపై అప్‌డేట్ ఇవ్వాలంటూ డార్లింగ్‌ను కోరుతున్నారు. సంక్రాంతి పండుగను పొడిగిస్తూ ప్రభాస్ రేపు (జనవరి 17) తన లేటెస్ట్ మూవీ గురించి ఒక అప్‌డేట్ ఇవ్వనున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రేపు డార్లింగ్ 20వ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వబోతున్నాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







