సరిలేరు నీకెవ్వరు సక్సెస్: రష్మిక ఇంట్లో ఐటీ దాడులు
- January 16, 2020
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కన్నడ హీరోయిన్ రష్మిక మందనా ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే అనుకోని షాక్ ఎదురైంది.
ఆమె సొంత రాష్ట్రం కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట శివార్లలో ఉన్న ఇంట్లో గురువారం(16 జనవరి 2020) ఉదయం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు రష్మికకు సంబంధించిన బ్యాంక్, ఆస్తి వివరాలను పరిశీలిస్తున్నారు. రష్మిక సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా.. ప్రస్తుతం ఇంట్లో లేదు.
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటనకు గాను ఆమెకు ప్రశంసలు అందుతున్న సమయంలోనే ఈ ఐటీ దాడులు జరగడం విశేషం. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు కన్నడలో హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలో రష్మికకు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







