తెలంగాణ:లాటరీ నెపంతో ఘరానా మోసం..
- January 16, 2020
తెలంగాణ:సైబర్ క్రైమ్స్‌పై అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొచ్చి అవగాహన కల్పించినా.. డబ్బుపై ఆశతో నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు జనాలు. తాజాగా.. మరో ఘటన నిజమాబాద్‌లో చేటుచేసుకుంది. ఆర్మూర్ మండలం చెపుర్ గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి వృత్తిలో భాగంగా కువైట్‌లో ఉంటున్నాడు. లాటరీలో 46 లక్షలు వచ్చాయని, అతనికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మాకు రూ. 15 లక్షలు ఇస్తే.. మీకు రూ. 46 లక్షలు ఇస్తామని నేరగాళ్లు మభ్య పెట్టారు. డబ్బుమీద ఆశతో అతను నేరగాళ్ల ట్రాప్‌లో పడ్డాడు. దీంతో.. తన వద్ద ఉన్న రూ.4 లక్షలతో పాటు, భార్య వద్ద ఉన్న 11 లక్షలు నేరగాళ్ల అకౌంట్‌లో వేశాడు. డబ్బు ఇంకా రాకపోవడంతో అతను ఆ ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేశాడు. ఆ నెంబర్ కలవకపోవడంతో.. పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అనంతరం లాటరీ కాల్ ఫేక్ అని తెసుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు అశోక్, ముత్తెమ్మ దంపతులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







