భారీ వర్షం.. ఆనందంలో ఆస్ట్రేలియా..
- January 17, 2020
ఆస్ట్రేలియా:గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియా.. కార్చిచ్చుతో అతలాకుతలం అవుతుందన్న విషయం తెలిసిందే. లక్షల ఎకరాల అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. కోట్ల జీవరాశులు కూడా ఈ అగ్నికి ఆహుతయ్యాయి. అయితే రెస్క్యూ టీం ఎంత ప్రయత్నించినా.. కార్చిచ్చు మాత్రం అదుపులోకి రాలేదు. ఆసీస్‌తో పాటుగా.. ప్రపంచ దేశాలన్నీ వరుణదేవుడిని ప్రార్థించింది. ఎట్టకేలకు వరుణదేవుడు ఆసీస్‌ను కరుణించాడు. న్యూసౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో బుధవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదపు అరగంటలోనే..50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో వాతావరణం చల్లబడటంతో అగ్నిమాపక సిబ్బంది కాస్త కుదుటపడ్డారు. భారీ వర్షం కురవడంతో.. న్యూసౌత్‌వేల్స్‌లో 32 చోట్ల మంటలు అదుపులోకి వచ్చినట్లు ఫైర్ సిబ్బంది పేర్కొంది. కాగా, న్యూసౌత్‌వేల్స్‌లో 88 చోట్ల, విక్టోరియాలో 18 చోట్ల ఇంకా కార్చిచ్చు అదుపులోకి రాలేదని.. బుధవారం భారీ వర్షంతో పాటు.. పిడుగులు పడటంతో.. మరో రెండు చోట్ల కార్చిచ్చు మొదలైందని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..