స్కామ్‌ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలి

- January 17, 2020 , by Maagulf
స్కామ్‌ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలి

మనామా:జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ యాంటీ కరప్షన్‌ అండ్‌ ఎకనమిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ, స్కామ్‌ మెసేజ్‌లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. వాట్సాప్‌ అప్లికేషన్‌ ద్వారా, ఇతర మార్గాల్లో స్కామర్స్‌ స్కామ్‌ మెసేజ్‌లను ప్రచారంలోకి తెస్తున్నారనీ, వాటి ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నారని డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. ఈ తరహా మెసేజ్‌లో పాస్‌వర్డ్‌లను, స్మార్ట్‌ డివైజ్‌లను హ్యాక్‌ చేసేలా వుంటున్నాయని తెలిపింది డిపార్ట్‌మెంట్‌. స్కామ్‌ మెసేజ్‌లపై డిపార్ట్‌మెంట్‌ హాట్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com