ఖతార్ లేబర్ చట్టాల్లో సంస్కరణలు..ప్రవాసీయులకు భారీ ఊరట

- January 17, 2020 , by Maagulf
ఖతార్ లేబర్ చట్టాల్లో సంస్కరణలు..ప్రవాసీయులకు భారీ ఊరట

దోహా:లేబర్ చట్టాల్లో సంస్కరణలు చేపడుతూ ఖతార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రవాసీయులకు భారీ ఊరట లభించనుంది. ఖతార్ విడిచి స్వదేశానికి వెళ్లాలనుకునే ప్రవాసీయులకు అడ్డంకిగా మారిన నిబంధనలు ప్రభుత్వం తొలగించింది. ఇంటర్నేషనల్ లేబర్ పాలసీ స్టాండర్డ్స్ స్థాయిలో అమలు చేస్తున్న సంస్కరణలతో ఇక నుంచి కాంట్రాక్ట్ నిబంధనలు సాకుగా చూపి యజమానులు వలస కార్మికులను అడ్డుకునే అవకాశం ఉండదు. దీంతో వివిధ సెక్టార్ లో పని చేసే ఎంప్లాయిస్, కార్మికులతో పాటు డొమస్టిక్ వర్కర్స్ ఇక యజమానుల నుంచి సమస్యలు లేకుండా తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోవచ్చు. లేబర్ చట్టాల్లో మార్పులు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు ఖతార్ లేబర్ లా, గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ ఆఫీస్ ట్వీట్ చేసింది. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ గడువు ముగియకున్నా ప్రవాసీయులు టెంపరర్ గా కానీ, పర్మినెంట్ గా స్వదేశానికి వెళ్లవచ్చని తెలపింది. అయితే..72 గంటల ముందు యజమానికి ఇన్ఫాం చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయిస్ అయితే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. మినిస్ట్రిస్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసేవారు, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్, మారిటైమ్ కంపెనీస్, అగ్రికల్చర్ కంపెనీస్, అన్ని రకాల తాత్కాలిక ఉద్యోగ రంగాల్లో ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఖతార్ చేపట్టిన సంస్కరణలను ఐక్యరాజ్యసమితి స్వాగతించింది. ఖతార్ చరిత్రలో ఈ నిర్ణయం మైలురాయిగా నిలిచిపోతుందని అభివర్ణించింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com