హోబర్ట్‌లో డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సానియా మీర్జా
- January 19, 2020
మెల్బోర్న్:ఒకవైపు మాతృమూర్తిగా బిడ్డ సంరక్షణను చూసుకోవడం, మరోవైపు క్రీడారంగంలో రాణిస్తూ..దేశ జెండాను రెపరెపలాడించడం. ఏకకాలంలో రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూ..”సరిలేరు మీకెవ్వరు” అనిపించుకుంటున్నారు భారత విమెన్ ప్లేయర్లు. దాదాపు రెండేళ్లకు పైగా ఆటకు దూరమై, తిరిగి మెగాటోర్నీలో పున:ప్రవేశం చేసి విన్నర్‌గా సత్తా చాటింది భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అమ్మ అయిన తర్వాత ఆమె ఆడిన తొలి టోర్నీ ‘హోబర్ట్ ఇంటర్నేషనల్’లో మిక్డ్స్ డబుల్స్ కేటగిరీలో టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. ఈ నెల 18న ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జరిగిన ఫైనల్‌లో 6-4, 6-4తో విన్నర్‌గా నిలిచింది సానియా-నదియా జోడి. తదనంతరం గ్రౌండ్‌లో తన బిడ్డతో ఫోటో దిగి “జీవితంలో ఇది అత్యంత ఆనందకరమైన రోజు” అని ఫోటో పోస్ట్ చేసింది సానియా. నిజంగా ఇది మాములు విషయం కాదు. ఆమెకు ఇప్పుడు రకరకాల సవాళ్లు ఉంటాయి. బిడ్డ పుట్టిన తర్వాత మానసికంగా, శారీరకంగా కొన్ని మార్పులు సంభవిస్తాయి. వాటిన్నింటికి ఎదురొడ్డి నిలవాలి. జిమ్‌లో ఎక్కువసేపు శ్రమించాలి. మానసికంగా కూడా ఎంతో సంసిద్దత సాధించాలి. వీటన్నింటి దాటి వచ్చి ఆమె ప్రదర్శించిన ఆటతీరు నిజంగా అమోఘం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







