షిరిడీ సాయి భక్తులకు శుభవార్త
- January 19, 2020
ముంబై: షిరిడీలో బంద్ విరమిస్తున్నట్లు షిర్డీ ప్రజలు ప్రకటించారు. సోమవారం సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. అంతకు ముందు షిరిడీ గ్రామస్థులు ఇవాళ బంద్ చేపట్టారు. బంద్ సమయంలో ఆలయ పరిసరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు మూసి ఉన్నాయి. అయితే దర్శనాలు, పూజలు యథావిధిగా కొనసాగాయి. బంద్ ప్రభావం ఆలయంపై ఉండబోదని ఆలయ ట్రస్టు ప్రకటించింది. సాయిబాబా జన్మస్థలమైన పత్రిలో భక్తుల సౌకర్యార్థం భవనాల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామంటూ సీఎం ప్రకటించడంతో షిర్డీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రి అభివృద్ధితో షిర్డీ ఆలయ ప్రాశస్త్యం తగ్గిపోతుందేమోనని షిరిడీ, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పత్రి సాయిబాబా జన్మస్థలమన్న వ్యాఖ్యలను ఉద్ధవ్ ఉపసంహరించుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







