200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి సంక్రాంతి ఛాంపియన్‌గా నిలిచిన`సరిలేరు నీకెవ్వరు`!!
- January 21, 2020
సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్‌స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే 200 కోట్ల రియల్ గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి సంక్రాంతి రియల్ ఛాంపియన్‌గా నిలిచిందన్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ- `సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్‌స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` ప్రేక్షకుల, అభిమానుల అపూర్వ ఆదరణతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ మహేశ్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. మా చిత్రాన్నిఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేశ్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు`` అన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







