దుబాయ్ కి చెందిన 8 మంది భారతీయులు నేపాల్‌లో మృతి
- January 21, 2020
నేపాల్:ఎనమిది మంది భారత టూరిస్టులు నేపాల్‌లోని ఓ హోటల్లో మృతి చెందారు. ఈరోజు ఉదయం నేపాల్‌లోని దామన్‌లో ఉన్న హోటల్లో ఈ ఘటన జరిగింది. హోటల్ గదిలో హీటర్ గాలికి ఆక్సీజన్ అందకపోవడంతో.. ఊపిరాడక మృతి చెందారు. వీరంతా కేరళకు చెందినవారు. నివేదికల ప్రకారం.. కేరళలోని తిరువనంతపురం నుండి 15 మంది బృందం నేపాల్ వెళ్లింది. నేపాల్ మక్వాన్పూర్ జిల్లా డామన్ లోని ఒక హోటల్ లో నాలుగు గదులను బుక్ చేసుకున్నారు. వారిలో ఎనిమిది మంది ఒక గదిలో ఉండగా, మిగిలినవారు మరొక గదిలో ఉన్నారని రిసార్ట్ మేనేజర్ చెప్పారు. హోటల్ గదిలో హీటర్ గాలికి ఆక్సీజన్ అందకపోవడంతో.. ఊపిరాడక మృతి చెందారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి దాదాపు 2500 మీటర్ల ఎత్తులో ఉంది.దుబాయ్‌లో నివసిస్తున్న తిరువనంతపురానికి చెందిన ప్రవీణ్ కృష్ణన్ నాయర్ (39), అతని భార్య శరణ్య (34) వారి ముగ్గురు పిల్లలతో పాటు శ్రీభద్ర (9), ఆర్చా (8), అభి నాయర్ (7) మరణించారు. కోజికోడ్‌కు చెందిన ప్రవీణ్ స్నేహితుడు రెంజిత్ కుమార్ టిబి (39), అతని భార్య ఇందూ రెంజిత్ (34), వారి కుమారుడు వైష్ణవ్ రెంజిత్ (2) కూడా ఒకే గదిలో నిద్రిస్తున్నారని మక్వాన్పూర్ జిల్లా పోలీసు కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ ముగ్గురూ కూడా మరణించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారి కుమారుడు మాధవ్ వేరే గదిలో నిద్రించగా. అతను ప్రాణాలు దక్కించుకున్నాడు.నేపాల్ నుంచి ఇండియాకు మృతదేహాల్ని తీసుకురావటానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







